నవరాత్రులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
NEWS Sep 06,2024 06:21 pm
గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని డీఎస్పీ గంగారెడ్డి అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతువేదికలో గణేశ్ మండపాల నిర్వాహకులు వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. నిమజ్జనం రోజు డీజేలకు అనుమతి లేదని తెలిపారు. గణేశ్ మండపాల వద్ద నిర్వాహకుల వివరాలు, ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులు నమ్మవద్దని కోరారు.