విద్యుత్ తీగలు తగిలి వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన బజార్హత్నూర్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని మాడగుడ గ్రామ సమీపంలోని ఓ పత్తి చేసులోకి కొడప గంగారం అనే వ్యవసాయ కూలి శుక్రవారం కూలీ పనికి వెళ్ళాడు. చేనులో అడవి పందులకు అమర్చిన విద్యుత్ వైర్లకు తగిలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.