వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి
NEWS Sep 06,2024 06:23 pm
వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్ సూచించారు. సోన్ మండలంలోని న్యూ వెల్మల్ బొప్పారం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాలు అధికంగా కురవడం వల్ల వైరల్ జ్వరాలు వ్యాపించే అవకాశం ఉన్నందున వ్యాధులు ప్రబలకుండా సిబ్బంది నియంత్రణ, నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.