లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి మూడేళ్ళ జైలు
NEWS Sep 06,2024 06:24 pm
మైనర్ బాలిక పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి (పొక్సో కేసులో) మూడేళ్ళ జైలు శిక్షతో పాటుగా 2 వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల జిల్లా జడ్జి (ఇన్చార్జి పొక్సో కోర్టు) ఎన్. ప్రేమలత తీర్పు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని, శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని, పోలిసులు, ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ, న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని అన్నారు.