వడ్డెపల్లి కృష్ణ మృతికి కేటీఆర్ సంతాపం
NEWS Sep 06,2024 06:26 pm
సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ మరణ వార్త ఎంతో బాధించిందని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల లోని చేనేత కుటుంబంలో పుట్టిన ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారని రచయితగా, పరిశోధకుడిగా, దర్శకుడిగా ఇలా పలు రంగాల్లో అద్భుతమైన ప్రతిభతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారని, సాహిత్య రంగంలో వడ్డెపల్లి కృష్ణ సేవలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కిందన్నారు. వడ్డెపెల్లి కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.