మట్టి గణపతి లతో పర్యావరణాన్ని పరిరక్షించచ్చని, ప్రతి ఒక్కరు మట్టి గణపతులను పూజించాలని సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సిరిసిల్లలోని మానేరు స్వచ్ఛంద సంస్థ, గోదావరి పాలిమర్స్ ఆధ్వర్యంలో కేకే మహేందర్ రెడ్డి, మానేరు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు చింతోజి భాస్కర్ చేతుల మీదుగా ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలనిపంపిణీ చేశారు. కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు ముందుకు కోరారు.