మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ
NEWS Sep 06,2024 06:38 pm
అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS విభాగం ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను గిరి గ్రామాలలో పంపిణీ చేశారు. దలపతిగూడ, బోడుగుడ, డింగ్రిపుట్టు, చొంపి, బోసుబెడ గ్రామాల గిరిజనులకు మట్టి వినాయక ప్రతిమల పూజించటంపై అవగాహణ కల్పించి NSS వాలంటీర్స్, కాలేజీ అధ్యాపకులు మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు. పంపిణీ లో NSS P.O లు నాగ బాబు, విజయ లక్ష్మి, అనిత కుమారి, కళాశాల ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.