నందమూరి మోక్షజ్ఞ జన్మదిన వేడుకలు
NEWS Sep 06,2024 06:34 pm
శ్రీసత్యసాయిజిల్లా: హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ జన్మదిన వేడుకలను స్థానిక పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నాయకులు నందమూరి అభిమానుల తరఫున గురునాథ సర్కిల్లో, అదేవిధంగా మైనార్టీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎంఎస్ షఫీఉల్లా ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ చేసి పేదలకు పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు.