గురుకుల డిగ్రీ కళాశాల ప్రవేశ దరఖాస్తుల ఆహ్వానం
NEWS Sep 06,2024 06:32 pm
సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో ఏర్పాటు చేసిన MJPTBCWRDC బాలుర గురుకుల డిగ్రీ కళాశాలలో సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆ సీట్లకు ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు కూడా ఈనెల9వ తేదీ వరకు ఎల్లారెడ్డిపేట డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని కళాశాల స్పెషల్ ఆఫీసర్ కె. వీర ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు 76800 51752, 70131 47565 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.