డుంబ్రిగూడ మండలంలో భారీ వర్షం
NEWS Sep 06,2024 06:39 pm
డుంబ్రిగూడ మండల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. శుక్రవారం ఉదయం నుండి ఎండ తీవ్రత ఉన్నా సాయంత్రం 5.30 గంటల నుండి వర్షం దంచి కొడుతుంది. దీంతో ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే వారు చాలా ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం అరకు సంత అయిపోయిన తరువాత వర్షం పడటంతో వ్యాపారస్తులు, కొనుగోలు దారులు ఊపిరి పీల్చుకున్నారు.