సీపీఐ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ
NEWS Sep 06,2024 06:36 pm
అనంతపురం: వరద బాధితులకు విరాళాల సేకరణ కార్యక్రమంలో భాగంగా అనంతపురం నగరంలో సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్, జిల్లా కార్యదర్శి జాఫర్ సహాయ కార్యదర్శి నారాయణస్వామి హాజరై దుకాణాదారులు, ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి శ్రీరాములు, సహాయ కార్యదర్శిలు రమణ తదితరులు పాల్గొన్నారు.