మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ
NEWS Sep 06,2024 06:40 pm
సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో మున్సిపల్ చైర్ పర్సన్ కళ చక్రపాణి చేతుల మీదగా మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ శ్రీమతి జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ వినాయక విగ్రహాలు నెలకొల్పే భక్తులందరూ సాధ్యమైనంత వరకు మట్టి విగ్రహాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తొందరగా నీటిలో కరగకుండా, వినాయక విగ్రహాల తయారీలో వాడిన రసాయన రంగుల వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుందని అన్నారు.