ఎరువుల దుకాణంలో తనిఖీలు
NEWS Sep 06,2024 06:42 pm
బూర్జమండలం కొల్లివలస, కేకేరాజపురంలో ఉన్న ఎరువులు, పురుగుమందుల దుకాణాలలో మండల ఏవో ఎన్ శ్రీనివాసరావు తనిఖీలు నిర్వహించారు. దస్త్రాలు,గొడౌన్లులో ఎరువుల స్టాక్ వివరాలు పరిశీలన చేశారు. తనిఖీల్లో భాగంగా యూరియా, కాంప్లెక్స్ ఎరువుల నమూనాలు సేకరించి రీజనల్ కోడింగ్ సెంటర్ విశాఖపట్నం పంపించారు. నిర్దేశిత ప్రమాణాలు లేకపోతే ఎరువుల నియంత్రణ చట్టం 1985 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.