సిరిసిల్ల పవర్లూమ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
NEWS Sep 06,2024 06:43 pm
సిరిసిల్ల: బి.వై.నగర్ లోని కామ్రేడ్ అమృతలాల్ శుక్లా కార్మిక భవన్ సిఐటియు జిల్లా కార్యాలయంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్మికుల ఉపాధి అదేవిధంగా 2023 బతుకమ్మ చీరల10% యారన్ సబ్సిడీ, వర్కర్ టూ ఓనర్ పథకం తదితర అంశాలపై చర్చించి తొందరలోనే ముఖ్యమంత్రి సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలిసి సమస్యలపై కార్మికుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని అందించాలని మూషం రమేష్, కోడం రమణ అన్నారు.