ముగ్గురు ప్రాణాలు కాపాడిన హిందూపురం టూ టౌన్ పోలీసులు
NEWS Sep 06,2024 06:44 pm
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరప్ప కట్ట కింద అంబేద్కర్ నగర్ నందు నివాసం ఉన్న చైత్ర అనే మహిళ తన ఇద్దరు బిడ్డలతో కలిసి ఈరోజు సాయంత్రం 4.20 ప్రాంతంలో ఎంజీఎం స్కూలు గ్రౌండ్ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకోవాలని వెళ్ళగా 100 డయల్ సమాచారం మేరకు హిందూపురం టూ టౌన్ పోలీస్ వారు వెంటనే అక్కడికి వెళ్లి వారిని రక్షించడం జరిగినది.