శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండల పరిధిలోని గొందిపల్లి గ్రామంలో సునీతమ్మ అనే వివాహిత శుక్రవారం కుటుంబ సమస్యల కారణంగా పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.