పోలీసుశాఖలో పోస్టింగ్ ల పేరిట తాను డబ్బులు తీసుకున్నట్టు నిరూపించగలిగితే రాజకీయాలను నుంచి వైదొలుగుతానని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రకటించారు. శుక్రవారం స్థానిక ఆర్ అండ్ బి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇటీవల సీఐ పోస్టింగ్ కోసం తాను 20లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా చేసిన ఆరోపణలను రుజువు చేయాలని చేయాలని కవ్వంపల్లి డిమాండ్ చేశారు.