తూప్రాన్: తూప్రాన్ పట్టణంలోని శిరిడి సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో రేపు ఉదయం 6:30 గంటలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు శిరిడి సాయి సేవా ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. షిరిడి సాయి సేవా ట్రస్టు వద్దకు విచ్చేసి ఉచితంగా అందజేసే మట్టి విగ్రహాలను తీసుకువెళ్లాలని భక్తులకు సూచించారు. పర్యావరణాన్ని రక్షించేందుకు మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు