మట్టి వినాయకులే మేలు -ఎమ్మెల్యే
NEWS Sep 06,2024 06:46 pm
పర్యావరణానికి మట్టి వినాయకులు మేలు చేస్తాయని, పాస్టర్ ఆఫ్ పారిస్తో తయారుచేసిన విగ్రహాలతో ముప్పు తప్పదని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పేర్కొన్నారు. సదాశివపేట పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల వితరణ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ అపర్ణ శివరాజ్ పటేల్, వైస్ చైర్మన్ చింత గోపాల్, కమిషనర్ కౌన్సిలర్లు, పాల్గొన్నారు.