శ్రీ సత్యసాయి జిల్లా: పెనుకొండ మండలం రాంపురం గ్రామంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల పాఠశాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో వైసీపీ పార్టీ పాఠశాలలను నిర్వీర్యం చేసిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పెండింగ్ పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు.