పండుగను ప్రశాంతంగా జరుపుకోండి
NEWS Sep 07,2024 03:26 am
వినాయక చవితి పండుగను ప్రజలందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలలో పోలీసుల అనుమతితో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయాలని సూచించారు. వినాయక విగ్రహాల ప్రతిష్ఠ, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా నిర్వాహకులు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.