పర్యావరణాన్ని దెబ్బ తీయకూడదు
NEWS Sep 07,2024 03:42 am
పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా పండుగలు జరుపుకోకూడదని అదనపు కలెక్టర్.శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో కాలుష్య నియంత్రణ మండలి రామగుండం ద్వారా ఏర్పాటుచేసిన మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పూర్వకాలంలో పసుపు ముద్దలతో తయారుచేసిన గణపతులను పూజించేవారని, తరువాత మట్టితో తయారు చేసిన గణపతులను ఇంట్లో పెట్టుకొని పూజించేవారు కానీ ఇప్పుడు రకరకాల రంగులతో రసాయనాలతో కూడిన గణపతులను పూజిస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నామని తెలియజేశారు.