ముగ్గురు పేకాట రాయుళ్లు అరెస్ట్
NEWS Sep 07,2024 03:35 am
శ్రీసత్యసాయిజిల్లా: చిలమత్తూరు మండల పరిధిలోని వీరాపురం శివారు కర్ణాటక సరిహద్దులో పేకాట ఆడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారి వద్దనుంచి రూ.11,200 నగదు స్వాధీనం చేసుకొని, 4 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. పేకాట ఆడుతున్న సమాచారంతో దాడి నిర్వహించగా కొంత మంది పారిపోయారని, ముగ్గురు పట్టుబడ్డారని ఎస్సై మునీర్ అహ్మద్ వెల్లడించారు.