స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలి..
NEWS Sep 07,2024 06:50 am
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, పంచాయతీరాజ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అధికారులు పర్యటించి కావలసిన మౌలిక సదుపాయాల వివరాలు సేకరించి వాటికి ఎస్టిమేషన్ ఏసి పనులను 20 రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.