మహిళా సమస్యలకు సభ పరిష్కారం
NEWS Sep 07,2024 03:37 am
మహిళా సమస్యలన్నింటికీ శుక్రవారం సభ ఒక పరిష్కార వేదికగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కోతిరాంపూర్ అంగన్వాడీ కేంద్రాల సమన్వయంతో శుక్రవారం సభ, పోషణ మాసం ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు తమ సమస్యలు ఏవైనా శుక్రవారం సభలో విన్నవించుకోవచ్చని,సభానంతరం దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ప్రతి మహిళ, గర్భిణీ, బాలింత శుక్రవారం సభకు హాజరవుతుందన్నారు.