డిగ్రీ కళాశాలలో వన మహోత్సవం
NEWS Sep 08,2024 07:38 am
వనమహోత్సవ కార్యక్రమంలో బాగంగా అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ భరత్ కుమార్ నాయక్, అధ్యాపకులు, విద్యార్ధులు సుమారు 150 మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ప్రిన్సిపాల్ సూచించారు. బోటనీ అధ్యాపకులు లచ్చన్న, ఎన్ఎస్ఎస్ పిఓ లు నాగబాబు, విజయలక్ష్మి, అనితకుమారి పాల్గొన్నారు.