పారా ఒలింపిక్స్ లో అవనికి స్వర్ణం
NEWS Aug 30,2024 02:45 pm
పారిస్: పారా ఒలింపిక్ పోటీల్లో షూటింగ్ లో భారత్ కు రెండు పతకాలు లభించాయి. భారత మహిళా షూటర్ అవని లేఖర స్వర్ణం సాధించింది. మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని అదరగొట్టింది. రాజస్థాన్ కే చెందిన మరో మహిళా షూటర్ మోనా అగర్వాల్ కాంస్యం సాధించింది. అవని, మోనాలను ప్రధాని మోదీ అభినందించారు. అవని పారా ఒలింపిక్స్ లో 3 పతకాలు సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్ గా చరిత్ర సృష్టించిందని కొనియాడారు. కాంస్యం సాధించిన మోనాను కూడా మోదీ అభినందించారు.