మున్సిపల్‌లో నామినేషన్లకు శుభారంభం!
NEWS Jan 28,2026 08:58 pm
మెట్‌పల్లి మున్సిపల్ పరిధిలో ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తొలి రోజు ఉత్సాహంగా కొనసాగింది. మొత్తం 17 సెట్‌లతో 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపారు. రాజకీయ పార్టీల వారీగా చూస్తే, బీజేపీ తరఫున 4 మంది అభ్యర్థులు 5 సెట్‌లతో, కాంగ్రెస్ తరఫున 5 సెట్‌లు, అలాగే బీఆర్‌ఎస్ నుంచి కూడా 4 మంది అభ్యర్థులు 5 సెట్‌లతో నామినేషన్లు వేశారు. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.