3 నుంచి రేవంత్ ఎన్నికల ప్రచారం
NEWS Jan 28,2026 06:52 pm
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్రంలో పర్యటిస్తారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న సీఎం.. నెలాఖరుకు స్వదేశానికి తిరిగి వస్తారు. ఫిబ్రవరి 3న నల్గొండ జిల్లా మిర్యాల గూడ, 4న కరీంనగర్ జిల్లా జగిత్యాల, 5న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్‌లో సీఎం రేవంత్ పర్యటిస్తారు.