విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
NEWS Aug 30,2024 02:22 pm
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల వాష్ రూంలో సీక్రెట్ కెమెరా ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే విచారణ జరపాలని ఆదేశించారు. విద్యార్థినుల హాస్టల్ వాష్ రూంలో హిడెన్ కెమెరా ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్, ఎస్పీలకు చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎం సూచన మేరకు ఇప్పటికే వారు కాలేజికి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు.