అత్యాచారం కేసులో పదేళ్ళు జైలు
NEWS Aug 30,2024 02:46 pm
ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి శివారు పెద్ద రాఘవులు పేటకు చెందిన కొప్పాడి నాగరాజు కి పదేళ్ళు జైలు శిక్ష, 5 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పును ఇచ్చారని అమలాపురం రూరల్ సీఐ వీరబాబు తెలియజేశారు. 2012లో గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని వేధించి అత్యాచారానికి పాల్పడిన నేరం రుజువు కావడంతో శిక్ష విధించారన్నారు.