అనాథ బాలికను బడిలో చేర్పించిన కలెక్టర్
NEWS Aug 30,2024 02:46 pm
ఇటీవల తానూర్ మండలం బెళ్తారోడా గ్రామానికి చెందిన దుర్గ తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం బాలికను నిర్మల్ పట్టణంలోని పాఠశాలలో చేర్పించి, బాలిక చదువుకోవడానికి అవసరమైన వస్తువులను కొనిచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని బాలికకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.