అదనపు కలెక్టర్ రైస్ మిల్లుల తనిఖీలు
NEWS Aug 30,2024 02:48 pm
రైస్ మిల్లర్లు 2023-24 సీజన్ ఖరీఫ్ సీఎంఆర్ ఇవ్వాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. ముస్తాబాద్ లోని తిరుమల, శ్రీనివాస, నామాపూర్లోని ధన లక్ష్మి, సప్తగిరి, పోత్గల్ లోని బాలాజీ రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైస్ మిల్లుల్లో మిల్లింగ్, బియ్యం నాణ్యతను పరిశీలించారుసీఎంఆర్ లక్ష్యంఎక్కడి వరకు పూర్తి చేశారో అడిగి తెలుసుకున్నారు. అన్ని రైస్ మిల్లులకు అప్పగించిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెల 30 వ తేదీలోగా ఇవ్వాలని సూచించారు.