లారీని ఢీకొట్టిన కారు - ఒకరు మృతి
NEWS Aug 30,2024 02:48 pm
జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన కారు లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందిన ఘటన నేరడిగొండ మండలం కోరిటికల్ గ్రామ సమీపంలో జరిగింది. నేషనల్ హైవేపై లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టడంతో కారులో ఉన్న మహిళా మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మృతురాలు సిరికొండకు చెందిన ముత్యపు లాస్యగా గుర్తించారు.