ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి
NEWS Aug 30,2024 02:56 pm
పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సీఐ ఫనిందర్ సూచించారు.తలమడుగు మండలంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో వారు సమావేశం నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, ప్రతి గణేష్ మండపం ఏర్పాటు కోసం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అంజమ్మ, ఏఎస్ఐ కైసర్, గణేష్ మండల నిర్వాహకులు, తదితరులు ఉన్నారు.