రైతు సేవ కేంద్రాలలో రైతులకు యూరియా
NEWS Aug 30,2024 02:50 pm
బూర్జ మండలం అప్పలపేట, పాలవలస రైతు సేవ కేంద్రాలకు 20 టన్నుల యూరియా శుక్రవారం వ్యవసాయ అధికారులు కేటాయించారు. ఎరువులు కొరతను ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ దృష్టికి రైతులు తీసుకు వెళ్ళడంతో వ్యవసాయ శాఖ రైతు సేవ కేంద్రాలకు పంపించింది. రైతులు తమ ఆధార్ కార్డులతో వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు.