బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన పాలకొండ, బూర్జ, సీతంపేటలో వర్షాలు శుక్రవారం మధ్యాహ్నం నుండి మళ్లీ కురుస్తున్నాయి. మోస్తారు వర్షాలతో వరి పైరుకు ఈ వర్షం ఉపకరిస్తుందని రైతులు తెలియజేస్తున్నారు. కాగా ఈరోజు, రేపు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వాతావరణ శాఖ సూచనలు మేరకు భారీ వర్షాలు నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉందని తెలుపుతుంది, రైతులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంది.