కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ఎమర్జెన్సీ సినిమాను రాష్ట్రంలో నిషేదించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధి బృందం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిశారు. ఇందులో సిక్కు సమాజాన్ని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని.. ఈ మూవీ షూటింగ్ పూర్తిగా విరుద్ధంగా ఉందని రిప్రజెంటేషన్ సమర్పించినట్లు షబ్బీర్ తెలిపారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని.. ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ పై న్యాయపరమైన సంప్రదింపులు జరుపుతూనే విడుదలను నిషేధించే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం సిక్కు సంఘం నేతలకు హామీ ఇచ్చారని షబ్బీర్ తెలిపారు.