అరకులోయలో ఘనంగా వనం మనం కార్యక్రమం
NEWS Aug 30,2024 02:52 pm
ఉపాధిహామీ పథకం వేతనధారులు అరకులోయ మండలంలో వనం మనం కార్యక్రమాన్న ఘనంగా చేశారు. ఈ కార్యక్రమంలో బాగంగా సుంకరమెట్ట, బొండాం, చినలబుడు, మాదల పంచాయితీలలో సుమారు 2500 మొక్కలను నాటించడం జరిగిందని ఏపీఓ జగదీష్ తెలిపారు. ఈ వనం మనం కార్యక్రమంలో ఉపాధిహామీ వేతనధారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, విఆర్పీ లు పాల్గొన్నట్లు ఏపీఓ తెలియజేశారు.