నర్సీపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర పాల్గొని కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు మొక్కలను నాటడం ఎంతో ఉత్తమమన్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలన్నారు.