కాకినాడ జిల్లా జగ్గంపేట 16 వ నెంబరు జాతీయ రహదారి కిర్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో గల టోల్ ప్లాజా వద్ద లారీలో తరలిస్తున్న 84 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు కిర్లంపూడి సీఐ లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా కిర్లంపూడి పోలీస్ స్టేషన్ వద్ద పెద్దాపురం డిఎస్పీ లతాకుమారి పత్రికా సమావేశంలో మాట్లాడుతూ జాతీయ రహదారిపై 24 గంటలు ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు.