డుంబ్రిగుడ మండలంలోని కొర్రాయి పంచాయతీ పరిధి శాంతినగరం గ్రామంలో పాఠశాల భవనం ఏర్పాటు చేయాలని జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ శుక్రవారం డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. శాంతినగరంలో పాఠశాల భవనం లేక మంది విద్యార్థులు 2 కిలోమీటర్ల దూరంలోని కాలినడకన కిల్లోగూడ ప్రాథమిక పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై విద్యాశాఖ అధికారులు స్పందించాలని కోరారు.