సుప్రీం కోర్టుకు రేవంత్ సారీ
NEWS Aug 30,2024 06:42 am
సీఎం రేవంత్ సుప్రీంకోర్టుకు సారీ చెప్పారు. తన వ్యాఖ్యలు కోర్టును ప్రశ్నించినట్టు ఆపాదించారని రేవంత్ ట్వీట్ చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. కవిత్ బెయిల్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం ధర్మాసనం తప్పుబట్టింది. వ్యక్తులు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని నిందితులకు మేము బెయిల్ ఇస్తామా అంటూ.. రేవంత్ తరపు లాయర్లను జస్టిస్ గవాయి తిసభ్య ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి.. కోర్టు పట్ల గౌరవంగా మెలగాలని, రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంత మాత్రమూ సరికాదని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. దీంతో సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. భారత న్యాయవ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం, అపారమైన గౌరవం ఉందన్నారు.