మంచిర్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి పెంట సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. PACSలో రైతులకు తెలియకుండానే వారి పేరిట రుణాలు తీసుకొని అక్రమాలకు పాల్పడ్డారని, రుణాలు, నిధులు, ఎరువుల విక్రయాల నగదు సొంతానికి వాడుకున్నారని వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అధికారులు కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. దీంతో జిల్లా సహకార శాఖ అధికారి సంజీవరెడ్డి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.