రుణమాఫీ నగదు రైతులకు ఇవ్వండి
NEWS Aug 30,2024 06:43 am
రుణమాఫీ నగదును అప్పు ఖాతా కింద మినహాయించవద్దని, రైతులకు విధిగా నెలాఖరులోగా చెల్లించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. అధికారులతో రైతు రుణమాఫీ, రుణాల క్రమబద్ధీకరణ, మహిళాశక్తి రుణాల మంజూరు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. బ్యాంకర్ల వారీగా విడుదలైన మొత్తం రైతులకు ఇచ్చిన నగదు వివరాలపై ఆరాతీశారు. ఏకరూప దుస్తుల తయారీని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి శ్రీధర్, డీఆర్డీఓ సాయన్న ఉన్నారు.