విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రణించాలి:కలెక్టర్
NEWS Aug 30,2024 06:44 am
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. భారతీయ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ స్టేడియంలో వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ సమావేశ మందిరంలో బహుమతుల అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమకు ఇష్టమైన ఆటను ఎంచుకొని అందులో ప్రతిభ చూపాలని సూచించారు.