విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి: కలెక్టర్
NEWS Aug 30,2024 06:43 am
కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.నిర్మల్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కేజీబీవీ ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, విద్యాశాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. కేజీబీవీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.