జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి
NEWS Aug 30,2024 06:44 am
నిర్మల్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 31న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన ఇంచార్జ్ అధికారి శంకర్ తెలిపారు. విశ్వ అగ్రోటెక్ కంపెనీలో సెల్స్ ఎగ్జిక్యూటివ్, టీం లీడర్లకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, 10 వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. వయస్సు 20 నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్ 9441535253 సంప్రదించాలన్నారు.