మెట్‌పల్లిలో రైతుల మహా ధర్నా
NEWS Aug 30,2024 05:55 am
మెట్‌పల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ ఎందుకు చేయ లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్‌పల్లి లో రైతులు మహాధర్నా నిర్వహించారు. ఎన్నికల సభల్లో రైతులు పండించిన ప్రతి గింజను రేవంత్ రెడ్డి రూ.500 బోనస్, ఎకరాకు రూ.7500 రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ ఒకేసారి ఇస్తామని చెప్పి అధికారంలోకి రాగానే దేవుళ్లపై ఒట్టేసి మో సం చేశారని ఆరోపించారు. అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీఓకు వినతిపత్రం అందించారు.