హైడ్రా బుల్డోజర్లు ఇక హిమాయత్‌సాగర్ వైపే సాగుతున్నాయి. వారంలో జలాశయంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేశారు. జలమండలి, రెవెన్యూ అధికారులు ఎఫ్‌టీఎల్ (పూర్తిస్థాయి నీటి మట్టం) పరిధిలో ఉన్న నిర్మాణాలను గుర్తించే ప్రక్రియను మొదలెట్టారు. తొలి దశలో కొందరు ప్రముఖుల ఫామ్‌హౌస్‌లు, ఇతర నిర్మాణాలు ఇందులో ఉన్నట్టు తేలింది. కాంగ్రెస్ పార్టీ నేతల వంతు : అధికార కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలతోపాటు ఇతర పార్టీలు, ప్రముఖుల బంగ్లాలు ఈ జలాశయ పరిధిలో ఉన్నాయి.